డిప్యూటీ సీఎం పవన్ పర్యటన అధికారికంగా ఖరారయింది. పార్వతీపురం ఎల్విన్ పేట హెచ్ గ్రౌండ్ పరిసరాలను సోమవారం పరిశీలించారు. కురుపాం మండలం గిరిశిఖర ప్రాంతాలను సందర్శించనున్న నేపథ్యంలో హెలిపాడ్, రూట్ మ్యాప్ను అధికారులు తనిఖీ చేస్తున్నారు.
మన్యం జిల్లా పర్యటనకు వస్తున్న జనసేనానికి ఘనస్వాగతం పలికేందుకు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సన్నాహాలు చేస్తుండగా, ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు.