ప్రముఖ సంస్థలు, అగ్రశ్రేణి డిజైనర్లు రూపొందించిన ఆభరణాలు, గృహాలంకరణ వస్తువులు, పెళ్లి దుస్తులతో విజయవాడలోని నోవాటెల్‌లో ‘హై లైఫ్’ ఎగ్జిబిషన్ ఏర్పాటుచేశారు. బుధ, గురువారాల్లో జరిగే ఈ ఎగ్జిబిషన్‌లో ప్రముఖ బ్రాండ్‌లు, అగ్రశ్రేణి డిజైనర్ల నుంచి అత్యుత్తమ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ, ప్రత్యేకమైన ఉత్పత్తులను సొంతం చేసుకునేందుకు, ప్రసిద్ధ డిజైనర్లను కలిసి మరపురాని షాపింగ్ అనుభవాన్ని ఆస్వాదించేందుకు ‘హై లైఫ్’ ఎగ్జిబిషన్‌కు రావాలని ఔత్సాహికులను కోరారు.మంగళవారం ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో పట్టాలు తీసుకున్న విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపకులందరూ సంప్రదాయ వస్త్రాలు ధరించి వచ్చి విశేషంగా ఆకట్టుకున్నారు. మగవారంతా పంచె, ధోవతులు.. మహిళలందరూ చీరెలను ధరించారు. అవి కూడా మంగళగిరి చేనేత వస్త్రాలే కావడం మరో విశేషం! కలంకారీ ముద్రణతో కూడిన ఈ సంప్రదాయ వస్త్రాలను ధరించి.. తెలుగుదనం ఉట్టిపడేలా వేడుకకు హాజరుకావడం విశేషం.