ప్రజలు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని కొల్లిపర ఎస్ఐ కోటేశ్వరరావు సూచించారు. కొల్లిపర పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఆయన మాట్లాడుతూ వాట్సప్లో అపరిచితుల నుంచి వచ్చే లింక్లు ఓపెన్ చేయొద్దన్నారు. కొందరు సైబర్ నేరగాళ్లు ఆఫర్లు ఉన్నాయని. లింకులు పంపిస్తారని వాటిని క్లిక్ చేయగానే మన ఖాతాలలో ఉన్న నగదు మొత్తం చోరీ అవుతుందన్నారు. అలాంటి వాటి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.