భారత అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరైన రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 38 ఏళ్ల వయసులో అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో మూడో టెస్టు జరుగుతోంది. మూడో టెస్టులో ఐదో రోజు భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 260 పరుగులకు ముగించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో 89/7 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియా జట్టు భారత్‌కు 275 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం వెలుతురు సరిగా లేకపోవడంతో భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆపై వర్షం కురుస్తుండటంతో మ్యాచ్‌ను డ్రాగా నిర్ణయించారు. అశ్విన్ 106 టెస్టుల్లో 537 వికెట్లు సాధించాడు. భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా ఉన్నాడు. తొలి స్థానంలో అనిల్ కుంబ్లే (619 వికెట్లు) ఉన్నాడు. ఇక బ్యాటింగ్ లో కూడా అశ్విన్ అదరగొట్టాడు. 106 టెస్టుల్లో 3,503 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు.. 15 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బౌలర్ గా మొదలు పెట్టినా టెస్టుల్లో ఆల్ రౌండర్ వరకు అశ్విన్ ఎదిగాడు. ఇక వన్డేల్లో 116 మ్యాచ్ ల్లో 156 వికెట్లు తీశాడు. టి20ల్లో 65 మ్యాచ్ లు ఆడిన అతడు.. 72 వికెట్లు సాధించాడు. వన్డే, టి20లతో పోలిస్తే టెస్టుల్లో అశ్విన్ సూపర్ సక్సెస్ అయ్యాడు.