మార్కాపురం పట్టణ శివారులో గతంలో నిరాదరణకు గురైన ఇందిరమ్మ కాలనీ ఫేజ్-2ను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఇందిరమ్మ ఫేజ్-2 కాలనీలో మంగళవారం సాయంత్రం లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నారాయణరెడ్డి మాట్లాడుతూ 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఫేజ్-2ను ప్రారంభించారన్నారు. సుమారు 16 సంవత్సరాలు కావస్తున్నా కాలనీలో మౌలిక వసతులు కూడా లేవన్నారు. ముఖ్యంగా నీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యాలు లేకపోవ డంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను మధ్యలోనే వదిలేశారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కాలనీ గురించి పట్టించుకున్న పాపానపోలేదన్నారు. చాలామంది కాలనీ దుస్థితిని తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. గత నెలచివర్లో తాను అధికారులతో కలిసి కాలనీలో పర్యటించానన్నారు. కాలనీని ఎలాగైనా అభి వృద్ధి చేయాలని తాను ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులను కలిసి సమస్యలను తెలియజేశారన్నారు. ప్రధానంగా బేస్‌మెంట్ స్థాయిలో నిలిచిన ఇళ్లకు నూతన స్కీమ్‌ల ద్వారా బిల్లులు ఇవ్వాలని కోరాన న్నారు. బేస్‌మెంట్‌స్థాయిలో గృహాలు నిలిచి పోయిన లబ్ధిదారులు గతంలో తీసుకున్న బిల్లులు తిరిగి చెల్లిస్తే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.2.50 లక్షలు మంజూరు చేస్తుందన్నారు. గతంలో బేస్ మెంట్ నిర్మాణానికి రూ.16 నుంచి రూ.25 వేల వరకు బిల్లులు పొందారన్నారు. వాటిని తిరిగి చెల్లిస్తే వెంటనే నూతన నిర్మాణాలను ప్రారంభించుకునేందుకు అవకాశం కలుగుతుం దన్నారు. ఇందిరమ్మ ఫేజ్-2 కాలనీలో బేస్‌మెంట్‌స్థాయిలో నిలిచిపోయిన నిర్మాణాలు 267 ఉన్నాయన్నారు. అదేవిధంగా రూఫ్ లెవల్‌లో నిలిచిపోయిన గృహాలు 90, శ్లాబ్ పూర్తిచేసుకున్న నిర్మాణాలు 531 ఉన్నాయ న్నారు. వీరందరూ కొద్దిపాటి వ్యయం భరిస్తే నిర్మాణాలు పూర్తవుతాయన్నారు. వీరిలో స్వయం సహాయక సంఘాలలో ఉన్న వాళ్లకు రూ.35 వేలు రుణం మెప్మా అధికారులు ఇస్తారన్నారు. ఆ మొత్తాన్ని వాయిదాల్లో చెల్లించుకోవచ్చన్నారు. ముఖ్యంగా కాలనీకి చెన్నరాయునిపల్లి నుంచి బీటీ రహదారిని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయిం చానన్నారు. కాలనీలో సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్టుల నిర్మాణానికి రూ.43 కోట్లతో ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. ఆ నిధులతో కాలనీని సుందరంగా తీర్చిదిద్దుతా నన్నారు. లబ్ధిదారులు తప్పకుండా గృహాలు నిర్మించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, హౌసింగ్ డీఈ ఎ.పవన్‌కుమార్, టౌన్ ఏఈ సాయిచంద్, టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మల్లిఖార్జున్, మాలపాటి వెంకటరెడ్డి, కనిగిరి బాలవెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.