నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వైసీపీ నేత, మాజీ మంత్రి హాజరుకావడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కార్యక్రమానికి కూటమి నేతలు ఆహ్వానించకుండానే జోగి వచ్చారని మంత్రి కొలుసు పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఇప్పటికే వివరణ ఇచ్చారు. అయితే ఘటనపై తెలుగు తమ్ముళ్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని మంగళవారం మంత్రి పార్థసారథి కలిశారు. ఏపీ సచివాలయానికి వచ్చిన మంత్రి.. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఘటనపై పూర్తి సమాచారాన్ని చంద్రబాబుకు వివరించారు. జోగి రమేశ్ కార్యక్రమానికి రావడంతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.