విజయనగరం ఉడా కాలనీలో జరిగిన చోరీ ఘటనలో కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సిఐ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. ఉడా కాలనీలో పైలా నాగేశ్వరరావు రామలక్ష్మీ దంపతులు నివాసం ఉంటున్నారు.
కాగా నాగేశ్వరరావు మంగళవారం సాయంత్రం బయటకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి రామలక్ష్మి మెడలో గల 4 తులాల బంగారు తాడు అపహరించాడని నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.