ఏపీలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. మార్చి 17 నుంచి 31 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా దరఖాస్తు సమయంలో కొందరు విద్యార్థులు తమ వివరాలను తప్పుగా నమోదు చేసి ఉంటే వారికి మరో అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. తప్పులను ఎడిట్ చేసుకోవడానికి ఈ నెల 19 నుంచి 23 వరకు ఛాన్స్ ఇస్తున్నట్లు పేర్కొంది