అవనిగడ్డ మండలం పులిగడ్డలో ప్రసిద్ధ దేవాలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలోని బ్రాహ్మణ రేవు వద్ద రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుకను తరలిస్తున్నారు.
శుక్రవారం ఉదయం కూడా ఈ అక్రమ రవాణా కొనసాగుతుంది. పులిగడ్డ నుండి మోపిదేవి, అవనిగడ్డ మండలాలలోని గ్రామాలకు పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో తరలిస్తున్నా రెవెన్యూ, పోలీసులు చర్యలు తీసుకోకపోవడం పలువురు వాపోతున్నారు.