ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పరిసర ప్రాంతాలలో గత మూడు రోజులుగా కుక్కలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటి వరకు 8 మందిపై కుక్కలు దాడి చేసినట్లుగా స్థానిక ప్రజలు మంగళవారం తెలిపారు. గాయపడ్డ వారిలో ఒక చిన్నారి కూడా ఉన్నట్లుగా స్థానికులు చెప్పారు. పట్టణంలో కుక్కలు కోతుల బెడద అధికంగా ఉందని సంబంధిత అధికారులు స్పందించి వీధి కుక్కలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.