ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్లై యాష్ అనేది నా పుట్టగోసిలాంటిదన్న జేసీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 27, 2024, 03:41 PM

డబ్బుల కోసం పార్టీలో చేరారంటూ కొందరు మాట్లాడుతున్నారని... అసలు తమ గురించి ఏమనుకుంటున్నారని టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. 1951లోనే తాము మద్రాసులో చదువుకున్నామని... ఖరీదైన కార్లలో తాము ఎప్పుడో తిరిగామని చెప్పారు. ఫ్లై యాష్ అనేది తన పుట్టగోసిలాంటిదని అన్నారు. ఫ్లై యాష్ గొడవ కేవలం తమ ప్రిస్టేజ్ ఇష్యూ మాత్రమేనని చెప్పారు. తమకు కూడా చీము, నెత్తురు ఉంటుందని అన్నారు. తమకు న్యాయం చేయమని ఎస్పీ నుంచి డీజీపీ స్థాయి అధికారుల వరకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎవరికీ తల వంచమని... చేతకాకపోతే కుటుంబం కోసం క్లీనన్ పని చేసైనా బతుకుతామని చెప్పారు. పార్టీ అధ్యక్షుడి నుంచి మంత్రుల వరకు ఎవరికి లేఖలు రాసినా పట్టించుకోరని జేసీ అన్నారు. వైసీపీ హయాంలో తనను జైల్లో పెట్టి ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు. వైసీపీలోకి రావాలని గతంలో ఒత్తిడి వచ్చినా వెళ్లలేదని... వైసీపీకి లొంగకపోవడం వల్లే బస్సులు సీజ్ చేశారని అన్నారు. వైసీపీ హయాంలో పొగరును వదిలేసి, ప్రిస్టేజ్ కు పోకుండా ఉంటే ఏ సమస్య ఉండేది కాదని చెప్పారు. ఏం జరిగినా తమ నాయకుడు చంద్రబాబును నమ్ముకుని ఆయన వెంట నడిచానని తెలిపారు.జరుగుతున్న పరిణామాలతో తన భార్య, పిల్లలు పవన్ రెడ్డి, అస్మిత్ రెడ్డి నలిగిపోయారని జేసీ అన్నారు. వదిన తనను పట్టుకుని కన్నీళ్లు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన అన్న దివాకర్ రెడ్డి మానసిక వేదన అనుభవిస్తూ అనారోగ్యానికి గురయ్యారని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com