కూటమి ప్రభుత్వం హయాంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై వైసీపీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ ఎన్ కృష్ణమూర్తికి వినతి పత్రం సమర్పించారు. శుక్రవారం శ్రీకాకుళం పట్టణంలో వైసీపీ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించామని మాజీ మున్సిపల్ అధ్యక్షురాలు పద్మావతి, గేదెల పురుషోత్తం తదితరులు తెలిపారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.