కడప పర్యటనలో ఎంపీడీఓ జవహర్‌బాబును పరామర్శించి మీడియాతో మాట్లాడుతుండగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన సీరియస్‌గా మాట్లాడుతున్న సమయంలో అక్కడే ఉన్న కొందరు అభిమానులు "ఓజీ... ఓజీ..." అంటూ నినాదాలు చేశారు. దాంతో పవన్ "ఏంటయ్యా మీరు... ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదు... పక్కకు రండి" అని అసహనం వ్యక్తం చేశారు. కాగా, యువ దర్శకుడు సుజీత్ డైరెక్షన్‌లో పవన్ నటిస్తున్న 'ఓజీ' సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది. ఇక డిప్యూటీ సీఎం గత కొన్ని రోజులుగా గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన శుక్రవారం నాడు వైసీపీ నేతల దాడిలో గాయపడి కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్‌బాబును ఇవాళ పరామర్శించారు.