రాజస్థాన్‌లోని కోఠ్‌పుత్లీ- బెహ్రర్ జిల్లాలో చేతన అనే చిన్నారి తండ్రి పొలంలో ఆడుకుంటూ 700 అడుగుల బోరుబావిలో పడిపోయింది. ఈ ఘటన సోమవారం జరగ్గా, ఇప్పటికి ఆరో రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, స్థానిక పోలీసు సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. పైపుతో బోరుబావిలోకి ఆక్సిజన్ పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.మరోవైపు.. చిన్నారి పడిపోయిన బోరుబావికి సమాంతరంగా సొరంగం తవ్వడంపై అధికారులు దృష్టి సారించారు. తద్వారా బాలిక వద్దకు నిపుణులు చేరుకుని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు ర్యాట్ హోల్ మైనర్స్ సహాయం తీసుకుంటునట్లు అధికారులు తెలిపారు. ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికి చిన్నారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తామన్నారు.