క్యారెట్‌లో పోషకాలు అనేకం ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. క్యారెట్‌లో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది.ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. క్యారెట్ తింటే వయస్సు ఆధారిత సమస్యలు రావు. క్యారెట్‌లో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. క్యారెట్ తింటే ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి శరీరానికి లభిస్తుంది. క్యారెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి.క్యారెట్‌లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. క్యారెట్ తింటే మలబద్దకం, అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది. క్యారెట్ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్యారెట్ తింటే కొలెస్ట్రాల్ కరుగుతుంది. ధమనులు ఆరోగ్యంగా మారుతాయి. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. క్యారెట్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు నిండిన ఫీల్ అందుతుంది. క్యారెట్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. క్యారెట్ తింటే బరువు తగ్గొచ్చు.క్యారెట్‌లో ఉండే ల్యూటిన్, జియాంక్సితిన్ మొదడుకు మేలు చేస్తాయి. క్యారెట్ తింటే అభిజ్ఞా పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడుతుంది. క్యారెట్‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు దీర్ఘకాలిక సమస్యలను దూరం చేస్తాయి. క్యారెట్ తింటే షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. క్యారెట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు స్కిన్ టోన్‌ను మెరుగుపరుస్తాయి. క్యారెట్ తింటే గ్లో పెరుగుతుంది.