రాజస్థాన్ కోఠ్‌పుత్లీలో బోరుబావిలో పడిన 3ఏళ్ల బాలిక చేతన 8 రోజులుగా మృత్యువుతో పోరాటం చేస్తోంది. ఆ పసిబిడ్డను బయటకు తీసుకొచ్చేందుకు NDRF, SDRF, పోలీసులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పైపుతో బోరుబావిలోకి ఆక్సిజన్ పంపుతున్నారు. ఆమెను చేరుకునే ప్రయత్నాల్లో ఓ పెద్ద బండరాయి అడ్డుతగలగా, దాన్ని తొలగించి ఇవాళ చిన్నారిని బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది.తొలుత హుకప్‌టెక్నిక్‌తో చిన్నారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. సఫలం కాకపోవడంతో బోరుబావికి సమాంతరంగా సొరంగాన్ని తవ్వడం ప్రారంభించారు. ర్యాట్‌హోల్ మైనర్స్‌ను రంగంలో దించారు. పాలింగ్ మిషన్‌తో బోర్‌వెల్ (Borewell)కు సమాంతరంగా 170 అడుగుల సొరంగాన్ని తవ్వారు. ఆమెను చేరుకునే మార్గంలో పెద్ద బండరాయి అడ్డుగా ఉండటంతో ప్రస్తుతం దాన్ని తొలగించే పనిలో ఉన్నారు. మరోవైపు వాతావరణ సమస్యలు సహాయక చర్యలు ఆటంకం కలిగిస్తున్నాయి. ఎనిమిది రోజులుగా చేతన బోరుబావిలోనే నరకయాతన అనుభవిస్తోంది. పైప్‌ల ద్వారా అధికారులు లోపలికి ఆక్సిజన్ పంపిస్తున్నారు. కెమెరాల్లో బాలిక కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఆమె స్పృహ కోల్పోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.