గోదావరి - పెన్నా నదుల అనుసంధానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. క్షామం నుంచి రాష్ట్రాన్ని శాశ్వతంగా బయటపడేసే కీలక ప్రాజెక్టుకు కేంద్రం నుంచీ సానుకూల స్పందన లభించింది. ఈ మేరకు తన ఢిల్లీ పర్యటనలో సీఎం గట్టి ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే జల సంధానానికి సై అంటూ కూటమి ప్రభుత్వం తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతోంది.
ఆదివారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో గోదావరి-పెన్నా అనుసంధాన పథకంపై చంద్రబాబు సమీక్షించారు. ఉన్నతాధికారులంతా పాల్గొన్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ప్రాజెక్టును మూడు నెలల్లో ప్రారంభించి మూడేళ్లలో యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని చంద్రబాబు నిర్దేశించారు. తొలిదశలో గోదావరి-బనకచర్ల హెడ్ రెగ్యులేటర్‌కు రోజుకు రెండు టీఎంసీల చొప్పున పంపే ప్రతిపాదనకు ఆయన సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa