యువత, విద్యార్థులు మత్తు పదార్థాలు బారినపడి జీవితాలను నాశనం చేసుకోవద్ద కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. అరసవల్లి నగరంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన మహాసంకల్ప దినోత్సవంలో భా గంగా శ్రీకాకుళం అసోసియేషన్ ఆఫ్ పీడియా ట్రిక్స్, జిల్లా పోలీసు శాఖ సంయుక్తంగా నిర్వ హించిన 5కే వాక్‌లో ఆయన పాల్గొని మాట్లా డారు. యువత మత్తుకు బానిసలుగా మారి బంగారు జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. గత వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ను గంజాయి రాష్ట్రంగా మార్చారని, యువతను మత్తులో ముంచి వారి జీవితాలను నాశనం చేశారని విమర్శించారు. గంజాయిని కూకటివేళ ్లతో పెకిలించేందుకు కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ.. ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థులు ఎక్కువగా ఈ అలవాటుకు గురవుతున్నారని, వాటికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో వైద్యులు సనపల నరసింహమూర్తి, కొంచాడ సోమేశ్వరరావు, వాకముల్లు శ్రీరామ్మూర్తి, వం డాన కిరణ్‌కుమార్, రెడ్‌క్రాస్ చైర్మన్ జగ న్మోహన్‌రావు, ఎంఆర్‌కే దాస్, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.