సీఎం చంద్రబాబును టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై చంద్రబాబుతో టీటీడీ చైర్మన్ చర్చించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు సిఫార్సు లేఖలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వారానికి 4 సిఫార్సు లేఖలకు అంగీకారం తెలిపారు. అంతేకాకుండా వారానికి రెండు రూ.300 దర్శనం లేఖలను కూడా అంగీకరించాలని సీఎం.. చైర్మన్‌కు సూచించారు.