ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా కె. విజయానంద్ నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ(పొలిటికల్) కార్యదర్శి ఎస్. సురేశ్‌కుమార్ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రానికి సేవ చేసేందుకుగానూ తనపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజయానంద్ ధన్యవాదాలు తెలిపారు. ఏపీ నూతన సీఎస్ గా ఆదివారం అర్ధరాత్రి జీవో ఆర్టీ నెంబర్ 2209ను జిఏడి పోలిటికల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ జారీ చేశారు. ఈ నెల 31న ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ విరమణ చేయనున్నారు.