మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్‌లో బియ్యం మాయం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో జిల్లా సివిల్ సప్లయ్ శాఖ కృష్ణా జిల్లా మేనేజర్ కోటి రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి నిన్న (ఆదివారం) గోడౌన్ మేనేజర్ మానస తేజను అరెస్ట్ చేశారు. కోటి రెడ్డికి ఈ కేసులో ప్రమేయం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పేర్ని నాని గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయం అయ్యాయని ఇటీవల పోలీసులకు కోటి రెడ్డి ఫిర్యాదు చేశారు. బియ్యం నిల్వలు మాయంపై తనపై అనుమానం రాకుండా పోలీసులకు కోటిరెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి మానస తేజ, కోటి రెడ్డి అరెస్ట్‌లను పోలీసులు నేడు నిర్ధారించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈరోజు మచిలీపట్నం జిల్లా కోర్టులో పేర్ని జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణకు రానుంది.