వైసీపీ హయాంలో సీఎస్ నుంచి కానిస్టేబుల్ దాకా ఒక సామాజిక వర్గమే అని టీడీపీ నేత బుద్దా వెంకన్న అని విమర్శించారు. బీసీలకు టీడీపీతోనే మేలు జరుగుతుందన్న విషయం మరోసారి రుజువైందన్నారు. డీజీపీ, సీఎస్ కీలక పోస్టులు ఉన్నవాళ్లంతా బీసీలే అని అన్నారు.
జగన్ రెడ్డి బీసీలకు కత్తిపీట వేస్తే చంద్రబాబు పెద్దపేట వేశారని చెప్పుకొచ్చారు. బీసీల ముద్దుబిడ్డ చంద్రబాబు అని కొనియాడారు. వెనుకబడిన తరగతుల పక్షపాతి సీఎం చంద్రబాబు అని అన్నారు. బీసీల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.