అదానీ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. ‘అదానీ విల్మర్ లిమిటెడ్’ నుంచి అదానీ గ్రూప్ వైదొలగనుంది. సింగపూర్‌కు చెందిన ‘విల్మర్ ఇంటర్నేషనల్’ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ నుంచి అదానీ గ్రూప్ నిష్క్రమించనున్నట్లు తెలుస్తోంది.
తన వాటాలో విల్మర్ ఇంటర్నేషనల్‌కు 31.06శాతం, ఓపెన్ మార్కెట్‌లో మరో 13శాతం విక్రయించేందుకు నిర్ణయం తీసుకుంది. దీని మొత్తం విలువ 2బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా.