ఈవెంట్‌కు వెళ్లడమే కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే పాలిట శాపమైంది. సదరు ఎమ్మెల్యే ఈవెంట్‌లో వేదికపై నుంచి కింద పడిపోవడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు.ఆమె తలకు గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స జరుగుతోంది. ఇక, ప్రమాదానికి సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది.కేరళలోని కలూర్ స్టేడియంలో ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమా థామస్ హాజరయ్యారు. ఈ క్రమంలో స్టేజీపై సదరు ఎమ్మెల్యే నిర్వాహకులు, కార్యక్రమానికి వచ్చిన వారితో మాట్లాడుతున్నారు. అనంతరం, కుర్చీలో నుంచి లేచి పక్కకు వెళ్లే సమయంలో ఆమె.. వేదికపై నుంచి జారి పడ్డారు. ఈ సమయంలో నేల మీద కాంక్రీట్ స్లాబ్‌కు తలకు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తీవ్ర రక్తస్రావం అయింది.అయితే, వేదిక ఎత్తు దాదాపు 15 అడుగులు ఉండటంతో ఎమ్మెల్యే తలకు, ఊపిరితిత్తులకు గాయాలయ్యాయి. అలాగే, గర్భాశయం, వెన్నెముకలో గాయాలు కూడా అయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్‌పై వైద్యం జరుగుతోందని.. ఆరోగ్య పరిస్థితి కొంచెం మెరుగైనట్టు వైద్యులు వెల్లడించారు. తన వద్దకు వచ్చిన వారిని గుర్తించి, ఆమె మాట్లాడుతున్నారని వైద్యులు తెలిపారు.ఇదిలా ఉండగా.. ప్రమాదానికి సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. వేదిక ఏర్పాటు విషయంలో నిర్వాహకుల నిర్లక్ష్యం, తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. కార్యక్రమం నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు.
Footage of MLA Uma Thomas falling from the stage at Kaloor JLN Stadium is now out.#umathomas #kochi #kerala pic.twitter.com/xW7saafNEw
— Sreelakshmi Soman (@Sree_soman) January 2, 2025