ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. పల్నాడు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వైసీపీని వీడి టీడీపీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
చిలకలూరిపేట వైసీపీ ఇన్‌ఛార్జిగా విడదల రజినిని నియమించడంతో ఆయన అసంతృప్తి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మర్రి రాజశేఖర్ సంక్రాంతిలోపు సీఎం చంద్రబాబును కలిసే అవకాశం ఉందని సన్నిహితులు చెబుతున్నారు.