సిడ్నీ టెస్టులో తొలిరోజు భారత్ 185 పరుగులకు ఆలౌటైంది. అయితే రిషబ్ పంత్ విరోచిత పోరాటం కనబరిచాడు. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ల నుంచి బంతులు బుల్లెట్‌లా తన శరీరానికి తాకుతున్నప్పటకి పంత్ మాత్రం తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు.
ఈ క్రమంలో వెబ్‌స్టర్ బౌలింగ్‌లో పంత్ ఓ భారీసిక్సర్ బాదాడు. అతడు కొట్టిన షాట్‌తో బంతి ఏకంగా సైడ్‌స్క్రీన్‌పై చిక్కుకుపోయింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది.