విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాట కమిటీ నిరాహార దీక్ష రెండవరోజు కొనసాగుతోంది. ప్రధాని మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై సానుకూల ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పోరాట కమిటీ సభ్యులు.. ప్రధాని అపాయింట్‌మెంట్ కోరారు. అయితే, ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. ఈతరుణంలో ప్రధాని స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిక జారీ చేశారు.