చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో 49వ వార్డు సచివాలయాన్ని అనంతపురం రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పి. విశ్వనాథ్ గురువారం తనిఖీ చేశారు. వార్డు పరిధిలో పన్నుల వసూళ్లపై సమీక్షించారు. సచివాలయంలో కార్యదర్శులు హాజరు నమోదు, మూవ్మెంట్ రిజిస్టర్, పబ్లిక్ సర్వీసెస్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. వార్డు సచివాలయానికి వచ్చే ప్రజలతో సామరస్యంగా మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.