వైసీపీ అధినేత జగన్ బంధువు వైఎస్ అభిషేక్ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. చికిత్స పొందుతూ హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఇవాళ పులివెందులలో అంత్యక్రియల జరగనున్నాయి. ఈ ఉదయం పులివెందుల చేరుకున్న జగన్, వైఎస్ భారతి దంపతులు అభిషేక్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అభిషేక్ రెడ్డి కుటుంబ సభ్యులను జగన్ ఓదార్చారు. వైఎస్ అభిషేక్ రెడ్డి జగన్ కు సోదరుడి వరుస అవుతారు. అభిషేక్ రెడ్డి వైసీపీ వైద్య విభాగానికి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఆయన విశాఖలో వైద్య విద్యను అభ్యసించారు. పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ కార్యకలాపాలను అభిషేక్ రెడ్డి సమన్వయం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో పులివెందుల నియోజకవర్గంలో క్రియాశీలకంగా వ్యవహరించారు.