ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రజలు అనేక రకాల సర్వేలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వస్తువులు, భౌగోళిక పరిస్థితులు, జనాభా, ఆహారం ఇలా అనేక రకాల అంశాలపై సర్వేలు చేశారు. కానీ తాజాగా డాటాసెట్ కాంపెండింయ్ డాటా పాండా ఓ అరుదైన సర్వే చేసింది. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 142 దేశాల ప్రజల సగటు పురుషాంగం పరిమాణం ఎంతో కనుక్కుంది. అలాగే ఏ దేశం ఇందులో నెంబర్ వన్‌గా నిలిచిందో చెప్పడమే కాకుండా.. అన్ని దేశాల స్థానాలను వెల్లడించింది. ఆ లిస్టులో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది, అలాగే ఇండియా ఎన్నో ర్యాంకు రాబట్టుకుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బీజేయూ ఇంటర్నేషనల్ సెక్వుల్ మెడిసన్ జర్నల్‌లోని 2014 నివేదిక ఆధారంగా డేటాసెట్ కంపెండియం డేటా పాండా మొత్తం 142 దేశాలపై సర్వే చేసింది. ముఖ్యంగా ప్రతీ దేశానికి చెందిన 50 మంది పురుషుల పురుషాంగం పరిమాణం కనుక్కుంటూ.. ఈ సర్వేను పూర్తి చేసింది. ఈ సర్వేలో మొదటి స్థానంలో సుడాన్ నిలిచింది. సుడాన్ పరుషుల సగటు పురుషాంగం పొడవు 7.07 అంగుళాలు. అయితే ఇది ప్రపంచ సగటు కంటే ఎక్కువ కావడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరుషులందరి సగటు పురుషాంగం పొడవు 5.1 అంగుళాల నుంచి 5.5 అంగుళాల మధ్యే ఉంటుంది. కానీ సుడాన్ దీన్ని దాటి రికార్డు క్రియేట్ చేసింది.
ఇక రెండో స్థానంలో డీఆర్ కాంగో (7.05 అంగుళాలు)కాగా మూడో స్థానంలో ఈక్వెడార్ (6.93 అంగుళాలు), నాలుగో స్థానంలో కాంగో రిపబ్లిక్ (6.83 అంగుళాలు), ఐదో స్థానంలో ఘనా (6.81 అంగుళాలు), ఆరో స్థానంలో నైజీరియా (6.69 అంగుళాలు), ఏడో స్థానంలో వెనిజులా (6.66 అంగుళాలు), ఎనిమిదో స్థానంలో లెబనాన్ (6.62 అంగుళాలు), తొమ్మిదో స్థానంలో కొలంబియా (6.55 అంగుళాలు), పదో స్థానంలో కామెరూన్ (6.55 అంగుళాలు) నిలిచాయి. ఇదంతా బాగానే ఉన్న భారతదేశం ఏ స్థానంలో నిలిచిందనే కదా మీ డౌటు. ఆగండి అక్కడకే వస్తున్న.
పొడవైన పురుషాంగం కల్గిన 142 దేశాల్లో భారత దేశం 105వ స్థానాన్ని పొందింది. భారతీయ పురుషుల సగటు పురుషాంగం పొడవు 12.93 సెంటీ మీటర్లు అంటే 5.09 అంగుళాలు. ఆ తర్వాత స్థానంలో అంటే 106వ స్థానంలో చైనా (12.90 సెంటీ మీటర్లు) నిలిచింది. అలాగే మయన్మార్ (10.10 సెంటీ మీటర్లు) 138వ స్థానాన్ని పొందింది. ఆ తర్వాత వరుసగా 139, 140, 141, 142వ స్థానాల్లో నేపాల్ (9.98 సెంటీ మీటర్లు), కంబోడియా (9.84 సెంటీ మీటర్లు), ఉత్తర కొరియా (9.60 సెంటీ మీటర్లు), థాయిలాండ్ (9.50 సెంటీ మీటర్లు) నిలిచాయి. ఇక అగ్రరాజ్యం అమెరికా 5.57 అంగుళాలతో 68వ స్థానంలో నిలిచింది. కెనడా 5.48 అంగుళాలతో అమెరికాకంటే వెనుకబడింది.