యువత అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. మాచర్ల పురపాలక పరిధిలో పాత మాచర్ల పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో గురువారం నిర్వహించిన సర్వీస్ ప్రొవైడర్స్ మేళాను ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత ఇక్కడే కూర్చుంటే లక్ష్యాలను సాధించలేరని అవకాశాలను అందిపుచ్చుకున్నప్పుడే విజయం సాధించగలరని అన్నారు.