ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మెగా టోర్నమెంట్ లో ఆడే భారత జట్టును నేడు ఎంపిక చేశారు. నేడు ముంబయిలో 15 మందితో కూడిన టీమిండియా ఎంపికపై బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా శుభ్ మాన్ గిల్ వ్యవహరిస్తారని ఆ ప్రకటనలో వెల్లడించింది. జస్ప్రీత్ బుమ్రా గాయం నయం కావడంతో అతడికి కూడా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్థానం కల్పించారు. ఇక గాయాల కారణంగా సుదీర్ఘకాలంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్ లకు కూడా చోటిచ్చారు.