ఉద్యోగ భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్‌ఓ (EPFO) చందాదారులకు గుడ్‌న్యూస్ అందించింది. పీఎఫ్ చందాదారుల పేరు, పుట్టిన తేదీ తదితర వివరాలను మార్చుకోవడాన్ని సులభతరం చేసింది. అంటే, ఇకపై యజమాని (ఎంప్లాయర్) గానీ, ఈపీఎఫ్‌ఓ ఆమోదం అవసరం లేకుండానే ఆన్‌లైన్‌లోనే సులువుగా తమ వివరాలను మార్చుకోవచ్చు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఈ సేవలను శనివారం ప్రారంభించారు.