ఏపీలో కూటమి ప్రభుత్వం పాడి రైతులకు పశు నష్ట పరిహార పథకం అమలు చేస్తోంది. పాడి పశువులు చనిపోతే రైతులు నష్టపోకుండా ప్రభుత్వమే పరిహారం ఇవ్వాలి అనేది ఈ పథకం ఉద్దేశం. జాతి పశువు చనిపోతే రూ.30 వేలు, సాధారణ పశువు చనిపోతే రూ.15 వేల చొప్పున పరిహారం ఇస్తున్నారు. పశువులను కోల్పోయి డబ్బులు రాని వారు జిల్లాలోని పశు సంవర్ధక శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు చెబుతున్నారు.