ఆపదలో ఉన్న వారికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ఈ విషయంలో సీఎం చంద్రబాబు ఎల్లవేళలా ముందుం టారని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. మెళియాపుట్టి మండలం గొప్పి లికి చెందిన సీపాన కేశవ ప్రమాదవశా త్తు మృతి చెందిన నేపథ్యంలో ఆ కుటుం బానికి సీఎంఆర్‌ఎఫ్ నుంచి మంజూరైన రూ.2 లక్షల చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.