ప్రజల సొమ్మును వ్యాపారవేత్తలకు ధారాదత్తం చేయడమంటే సంపన్నుల అభివృద్ధి తప్ప సమగ్రాభివృద్ధి కాదని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, సీనియర్ జర్నలిస్టు తెలకపల్లి రవి అన్నారు. ప్రజలను అభివృద్ధి చేసినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఏపీ అభివృద్ధి లోకేశ్, పవన్ అభివృద్ధిగా మారుతోందని విమర్శించారు. కట్టు కథలతో కూడిన అభివృద్ధి తప్ప నిజమైన అభివృద్ధి జరగడం లేదని, సమగ్రాభివృద్ధిపై దృష్టి ఉన్న వాళ్లు అమరావతి, పోలవరం మాత్రమే అభివృద్ధి చేస్తామని చెప్తారా అని పశ్నించారు. రోడ్ల అభివృద్ధి పేరుతో టోల్ బాదుడు వేస్తే ఎవరు అభివృద్ధి చెందుతారని ఘాటుగా విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ వైద్య కళాశాలలో ఎస్‌ఎ్‌ఫఐలో పని చేస్తున్నప్పుడు నరసింహయ్య, గఫూర్, షడ్రక్‌ల విప్లవ కార్యక్రమాల గురించి వివరించారు. విజన్ 2047 ప్రజా వ్యతిరేకంగా ఉందని అన్నారు. వెనుకబడిన ప్రాంతాలు, నీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ ఆసుపత్రుల గురించి ఇందులో ప్రస్తావన లేదని చెప్పారు. ఈ సదస్సులో సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గౌస్ దేశాయ్, సీపీఎం అనంతపురం జిల్లా కార్యదర్శి ఒ.నల్లప్ప, తెలకపల్లి హరి, సీపీఎం జిల్లా నాయకులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.