తక్షణమే ప్రజా సమస్యలను పరిష్కరించాలని మంత్రి సవిత సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు. సోమవారం సోమందేపల్లి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మంత్రి సవిత ప్రజాదర్బార్ ను నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి ప్రజలు నుండి అర్జీలను స్వీకరించారు.
అక్కడికక్కడే పరిష్కరించాల్సిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.