ధర్మవరం చిన్నారి కాలేయ మార్పిడి కోసం రూ. 10 లక్షలను మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారం మంజూరు చేయించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సీఎంఆర్ఎఫ్ మంజూరు పత్రాన్ని మంత్రి కార్యాలయ సిబ్బంది అందించారు.
ధర్మవరంలోని నేసే పేటకు చెందిన అనిల్ కుమార్ కుమార్తె కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన స్పందించి ఈ మొత్తాన్ని మంజూరు చేయించారు.