అనంతపురం జిల్లాలో గత వారం రోజులుగా ప్రవేట్ బస్సులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 90 బస్సులపై కేసులు నమోదు చేసినట్లు ఉప రవాణా శాఖ కమిషనర్ వీర్రాజు ఓ ప్రకటనలో సోమవారం తెలిపారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రైవేటు బస్సులు అధిక ధరలకు టికెట్లు అమ్మి సొమ్ము చేసుకున్నాయని తెలిపారు.దీంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రూ. 19, 27, 500ల జరిమానా విధించినట్లు వివరించారు.