జమ్ము కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలోని బుధాల్ గ్రామంలో అంతుచిక్కని మరణాలు ఓ మూడు కుటుంబాలను వెంటాడుతున్నాయి. డిసెంబర్ నెల నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ మరణాలకు కారణం ఏంటో తెలుసుకునేందుకు ఆరోగ్య శాఖ అనేక ప్రయత్నాలు చేస్తున్నా.. ఎలాంటి ఉపయోగమూ లేకుండో పోతోంది. అలాగే మరణాలను కూడా వైద్యులు ఆపలేకపోతున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
రాజౌరీ జిల్లాలోని బుధాల్ గ్రామంలో గతేడాది డిసెంబర్ నెల 7వ తేదీన సహపంక్తి భోజనం నిర్వహించారు. అయితే ఒకే కుటుంబానికి చెందిన మొత్తం ఏడుగురు భోజనం చేయగా.. వారంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన జరిగిన ఐదు రోజులకే అంటే డిసెంబర్ 12వ తేదీన మరో కార్యక్రమంలో భోజనాలు చేసిన మరో కుటుంబంలోని తొమ్మిది మంది అనారోగ్యం బారిన పడ్డారు. అందులో ముగ్గురు చనిపోగా.. మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదంతా ఇలా ఉండగానే.. రెండో ఘటన జరిగిన నెర రోజుల తర్వాత అంటే జనవరి 12వ తేదీన మూడో ఘటన చోటు చేసుకుంది. మొత్తం పది మంత్రి తీవ్ర అస్వస్థతు గురికాగా.. ఇందులో ఆరుగురు చిన్నారులే ఉన్నారు. అయితే ఈ మూడు ఘటనల్లో కలిపి జనవరి 16 వరకు 15 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో నాలుగు రోజుల్లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఆదివారం రోజు రాత్రి ఓ బాలిక చనిపోగా.. మృతుల సంఖ్య తాజాగా 17కు చేరుకుంది.
వరసుగా మూడు కుటుంబాలకు చెందిన ప్రజలు చనిపోతుండడంతో.. స్థానికులంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అసలు వీరింతా ఎలా, ఎందుకు చనిపోతున్నారంటూ వైద్యులను పదే పదే ప్రశ్నిస్తున్నారు. కానీ వాళ్లు కూడా కారణం తెలియకు మిన్నుకుండిపోతున్నారు. ఈ ఘటనలపై స్పందించిన జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా వైద్యశాఖ అధికారులను అప్రమత్తం చేయగా.. బాధితుల నుంచి నమూనాలను సేకరించి దేశ వ్యాప్తంగా ఉన్న ల్యాబ్‌లకు పంపించింది. ఈక్రమంలోనే ఆ పదార్థాల్లో విష పూరిత పదార్థాలు ఉన్నట్లు గుర్తించగా.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తోంది.
మొదటి ఘటన తర్వాత నీళ్లు, ఆహారం నమూనాలను సేకిరంచిన సర్కారు.. ఆ తర్వాత బాధితుల నుంచి నమూనాలు సేకరించింది. ఘటన జరిగిన ప్రతీసారి కారణం తెలుసుకునేందుకు చాలానే ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు విపరీతంగా కృషి చేస్తున్న జమ్ము కశ్మీర్ సర్కారు.. ఎలాగైనా సరే త్వరలోనే ఈ మిస్టీరియస్ మరణాలకు కారణం తెలుసుకుని.. మరేవరూ ఇలా చనిపోకుండా చర్యలు చేపడుతామని అంటోంది.