దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో హోటల్ గదుల బుకింగ్స్ పెరిగాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఆయా రాజకీయ పార్టీలు ఇప్పటికే మూడు వేల గదులను ఫిబ్రవరి 10 వరకు బుక్ చేసినట్లు ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ తెలిపింది. ఢిల్లీవ్యాప్తంగా హోటళ్లు, అతిథి గృహాల్లో బుకింగ్‌లు దాదాపు 50 శాతానికి చేరుకున్నాయని పేర్కొంది.