జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను త్వరలో వాట్సాప్ ద్వారా అందించనున్నట్లు సీఎస్ విజయానంద్ తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్, ఏపీ సీఆర్ఎస్ అమలుపై అధికారులతో ఆయన సమీక్షించారు. వాట్సాప్‌లో సర్టిఫికెట్లు జారీ చేసే విధానాన్ని మొదటగా తెనాలిలో ప్రయోగాత్మకంగా చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు.