రోజురోజుకూ జనాలు రెచ్చిపోతున్నారు. అనేక మందికి కామంతో కళ్లుకు మూసుకుపోగా.. ఎక్కడ పడితే అక్కడే పనులు కానిచ్చేస్తున్నారు. ఒకప్పుడు చెట్లు, పొదలు, పార్కుల్లో, సినిమా థియేటర్లలో నచ్చిన వాళ్లతో కోరిక తీర్చుకోగా.. ఇప్పుడు బస్టాండులు, పబ్లిక్ ప్లేసుల్లోనే పచ్చిగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ ఇద్దరు టీచర్లు నేరుగా బడిలోనే బరితెగించారు. ఆఫీసు రూంలోనే అసభ్యంగా ప్రవర్తిస్తూ కెమెరాలకు చిక్కారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. ఆ ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు పైఅధికారులు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ జిల్లా సలేరా గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.. అక్కడే పని చేసే ఓ మహిళా ఉపాధ్యాయురాలితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే చాటు మాటుగా వీరిద్దరూ ఎలాంటి పనులు చేసుకున్నా ఎవరూ పట్టించుకోకపోయేవారే. కానీ వీరిద్దరూ బడిలోనే బరి తెగించేశారు. పాఠశాలలోని ఆఫీసు రూంలోనే అసభ్యంగా ప్రవర్తించారు. ముఖ్యంగా గదిలో ఎవరూ లేని సమయం చూసి.. ఒకరినొకరు ముద్దులతో ముంచెత్తుకున్నారు.
ఒకటీ, రెండు సార్లు కాదు.. ఈ జంట సందు దొరికినప్పుడల్లా రెచ్చిపోయింది. వారం, రోజుతో ఏమాత్రం సంబంధం లేకుండా చిన్న పిల్లలు చూస్తారనే భయం కూడా లేకుండా.. అక్కడే పని కానిచ్చారు. అయితే ఎవరూ చూడట్లేదని నిర్ధారించుకున్న తర్వాతే ఇలాంటి పనులు చేసిన ఈ జంటకు గట్టి షాక్ తగిలింది. ముఖ్యంగా వీరి బాగోతం అంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. అయితే దాన్ని గమనించిన ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా.. అది కాస్తా వైరల్ అయింది.
విచారణ పూర్తయ్యే వరకు ఇద్దరినీ సస్పెండ్ చేసిన అధికారులు
ఈ వీడియో చూసిన విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులు అంతా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. బడిలో ఇలాంటి పాడు పనులు ఏంటంటూ నిలదీశారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోకపోతే సహించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన విద్యాశాఖ అధికారులు.. ప్రధానోపాధ్యాయుడితో పాటు సదరు మహిళా ఉపాధ్యాయురాలిని కూడా సస్పెండ్ చేశారు. అయితే పూర్తి విచారణ తర్వాత వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది నిర్ణయిస్తామని.. టీచర్లను సస్పెండ్ చేస్తూ జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల్లో వెల్లడించారు. ముఖ్యంగా దీనిపై విచారణకు ముగ్గురు అధికారులతో కూడిన కమిటీని కూడా జిల్లా విద్యాశాఖ ఏర్పాటు చేసింది.