దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో రెండో రోజూ వరుస సమావేశాల్లో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి. దాదాపు 15కు పైగా సమావేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి, భేటీలు నిర్వహించనున్నారు. గ్రీన్ హైడ్రోజన్ - గ్రీన్ మాన్యుఫాక్చరింగ్, నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్, ఎనర్జీ ట్రాన్సిషన్, బ్లూ ఎకానమీ సదస్సులు - రౌండ్ టేబుల్ సమావేశాలకు చంద్రబాబు హాజరుకానున్నారు. సింగపూర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాన్ కిమ్ యాంగ్, యూఏఈ ఎకానమీ మినిస్టర్‌తోనూ ఈరోజు సీఎం భేటీకానున్నారు.వెల్స్పన్ చైర్మన్ బీకే గోయింకా, ఎల్జీ కెమ్ సీఈవో షిన్ హక్ చియోల్, కార్ల్స్‌బెర్గ్ సీఈవో జాకబ్ ఆరుప్ ఆండర్సన్, టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, వాల్‌మార్ట్ ప్రెసిడెంట్- సీఈవో కాత్ మెక్లే, సిస్కో సీఈవో చుక్ రాబిన్స్, కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ తదితరులతో పెట్టుబడులపై చర్చించనున్నారు. బ్లూమ్‌బెర్గ్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించనున్నారు.