సీతంపేట మండలంలో దిగువ బుడగరాయి, రేగులగూడ గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఆయా పోస్టుల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని సీడీపీవో రంగలక్ష్మి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా స్థానిక ఐసీడీఎస్ కార్యా లయానికి దరఖాస్తులు అందజేయాలని తెలిపారు. ఇతర వివరాల కోసం ఐసీడీఎస్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చునని సూచించారు.అలానే... పార్వతీ పురం మండలం చుక్కవానివలస అంగన్‌వాడీ కేంద్రం లో ఆయా పోస్టు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్టు శిశు సంక్షేమ పథక సంచాలకుడు బి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. స్థానిక స్థిర నివాసం ఉండి ఎస్టీ కులానికి చెంది పదో తరగతి ఉత్తీర్ణత పొంది 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న వివాహిత మహిళా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. ఈనెల 20 నుంచి 27వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా పార్వతీపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అందించాలన్నారు.అలానే సాలూరు మండలం రెయ్యివానివలసకు పీఎం జన్‌మన్ పథకంలో భాగంగా కొత్తగా అంగన్‌వాడీ కేంద్రం మం జూరైందని సీడీపీవో విజయలక్ష్మి చెప్పారు. ఆమె సోమవారం విలేకర్లతో మాట్లాడారు. కొత్తగా మంజూరైన అంగన్‌వాడీ కేంద్రంలో కార్యకర్త నియమాకానికి ఈనెల 27న అర్హులైన ఎస్టీ వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.