పాణ్యం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 25న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలులోని దేవి ఫంక్షన్ హాల్లో అమరరాజా కంపెనీలో 400 ఆపరేటర్లు, ట్రైనీ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. విద్యార్హతగా టెన్త్, ఇంటర్, పూర్తిఅయిన వారు రిజిస్ట్రేషన్ కోసం 8978913164, 9505370706 నంబర్లను సంప్రదించాలన్నారు.