ఎన్నికల ముందు యుద్ధం వస్తుందని తనకు ముందే తెలుసనీ.. రెండేళ్ల క్రితమే బీజేపీ నేతలు తనకు చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రస్తుతం కడప పర్యటనలో ఉన్న పవన్ ఎన్నికల ముందు యుద్ధం వస్తుందంటే.. మన దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. దేశభక్తి కేవలం వారిలో మాత్రమే ఉన్నట్టు బీజేపీ ప్రవర్తిస్తోందని వారి కంటే 10 రెట్లు అధికంగా మనకూ ఉందని చెప్పారు. మన దేశంలో హిందువులు ఎంతో ముస్లింలు కూడా అంతేనని, ముస్లింలు దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని .. ముస్లింలను భారత్ గుండెల్లో పెట్టుకుంటుందని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa