చాలామందికి ప్రతిరోజూ వేడి నీళ్లతో స్నానం చేసే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో పొగలు కక్కే నీళ్లతో స్నానం చేస్తుంటారు. మరికొందరు గడ్డకట్టే చలిలో అయినా చన్నీళ్లతోనే స్నానం చేస్తుంటారు.అయితే వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల సంతాన సమస్యలు వచ్చే అవకశాముందట. మహిళలకు పిల్లలు పుట్టకపోవడానికి హార్మోన్ల అసమతుల్యత, గర్భాశయ సంబంధ సమస్యలు వంటి ఎన్నో కారణాలు ఉండవచ్చు. కానీ పురుషులకు మాత్రం వీర్యకణాల నాణ్యత,పరిమాణం అనేవి మాత్రమే ప్రధాన సమస్యలుగా ఉంటాయి. వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల పురుషులకు సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.తగిన ఉష్ణోగ్రతలో స్నానం శరీరానికి శ్రేయస్కరం. కానీ ఎక్కువ వేడి నీటితో స్నానం ఆరోగ్యానికి ప్రతికూలంగా మారవచ్చు. చర్మ సమస్యలు, రక్తపోటు సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలను ఇది ప్రేరేపించవచ్చు. అధిక ఉష్ణోగ్రతలు శుక్ర కణాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. వృషణాలు శరీరంలోని మిగతా భాగాల కంటే కొద్దిగా చల్లగా ఉంటాయి. అధిక ఉష్ణోగ్రతలు వృషణాలను ప్రభావితం చేయడం వల్ల శుక్ర కణాల ఉత్పత్తి, నాణ్యత తగ్గే అవకాశం ఉంటుది. అధిక ఉష్ణోగ్రతలు శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీయవచ్చు. హార్మోన్ల అసమతుల్యత సంతానోత్పత్తి సమస్యలకు దారితీయవచ్చు.
అధిక ఉష్ణోగ్రతలు రోగ నిరోధక శక్తిని బలహీనపరిచే అవకాశం ఉంది. బలహీనమైన రోగ నిరోధక శక్తి సంతానోత్పత్తికి అవసరమైన అనేక శరీర ప్రక్రియలను ప్రభావితం చేస్తుంది. అయితే ఈ ప్రభావాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటాయి, అనేక ఇతర కారకాలపై ఆధారపడి ఉంటాయి.నిపుణుల సూచనల గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది. అధికంగా వేడి నీరు వాడకూడదు. వేడి నీటితో స్నానం చేసేటప్పుడు వృషణాలపై నేరుగా వేడి నీరు పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. వృషణాలను అధిక ఉష్ణోగ్రతల నుండి రక్షించడం చాలా ముఖ్యం. వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల సంతానోత్పత్తిపై నేరుగా ప్రభావం పడుతుందనే శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే అధిక ఉష్ణోగ్రతలు శరీరానికి కొన్ని ప్రభావాలను చూపుతాయి. అందుకే గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.