ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ‌స్వామివారిని దర్శించుకున్న గవర్నర్‌ నరసింహన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 28, 2019, 07:48 PM

ఉభ‌య తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్ దంప‌తులు గురువారం ఉద‌యం ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ‌స్వామివారిని దర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న గవర్నర్‌ దంపతులకు టిటిడి తిరుప‌తి జెఈవో బి.ల‌క్ష్మీకాంతం, ఆల‌య అర్చక బృందం పూర్ణ‌కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం అర్చ‌కులు శేషవస్త్రం బ‌హుక‌రించి, వేద‌శీర్వ‌చనం అందించారు. అనంతరం ఆల‌య మండపంలో గవర్నరు దంప‌తుల‌కు జెఈవో ల‌క్ష్మీకాంతం శ్రీ‌వారి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్య‌క్ర‌మంలో కడప కలెక్టర్ హ‌రికిర‌ణ్‌, జాయింట్‌ కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు, జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శ‌ర్మ‌, రాజంపేట ఆర్డీవో కోదండరామిరెడ్డి, టిటిడి విజివో  అశోక్‌కుమార్ గౌడ్‌, ఆల‌య డెప్యూటీ ఈవో నటేష్‌ బాబు, ఏఈవో రామ‌రాజు, ఇత‌ర త‌దిత‌రులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa