రేపు (జనవరి 26) జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో నేడు ఢిల్లీకి చేరుకున్నారు. నేడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న ప్రబోవో సుబియాంటోకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లోనే భారత ప్రధాని మోడీ ఆయనతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాజకీయ భద్రత, రక్షణ, వాణిజ్య సహకారంపై చర్చలతో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమయ్యేలా వీరు చర్చించుకోనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa